అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎవరికీ అందనంత రీతిలో సీట్లు గెలుపొంది వరుసగా మరోసారి అధికారా(Power)న్ని చేజిక్కించుకుంది. శాసనసభలోని మొత్తం 60 సీట్లకు గాను 46 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఏప్రిల్ 19న తొలివిడతలో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకు గాను 10 స్థానాల్ని ఎలాంటి పోటీ లేకుండానే ఏకగ్రీవం చేసుకుంది.
కారణాలివే…
యువతతోపాటు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నవారిదే బీజేపీ విజయంలో ప్రధాన పాత్ర.
స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం, ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగితను తగ్గిస్తామని హామీ ఇవ్వడం.
చైనాతో సరిహద్దు తగాదాలపై పూర్తిస్థాయిలో పోరాటం చేస్తామని హామీ ఇవ్వడం.
కొత్త అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం, పార్టీలో చేరినవారికి ప్రాధాన్యతనివ్వడం.
పార్టీ | గెలిచిన సీట్లు |
భారతీయ జనతా పార్టీ(BJP) | 46 |
నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) | 05 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) | 03 |
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(PPA) | 02 |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) | 01 |
ఇండిపెండెంట్స్(IND) | 03 |
మొత్తం | 60 |