
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ నియామకాలపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుందని, కానీ అది శూన్యంగా మిగిలిందని కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం కోసం 1,200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే వారి కుటుంబాలు ఘోషించేలా పాలనను కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాలు-నిరుద్యోగ భృతి మరచిపోయారంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద BJP 24 గంటల నిరాహారదీక్ష నిర్వహించింది. క్వశ్చన్ పేపర్ లీకేజీపై ఉద్యమం చేస్తే బండి సంజయ్ మీద కేసులు పెట్టారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు వెనక్కు వెళ్లాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం రెండు చేతులతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు BRSకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.