ఇందిరాపార్క్ వద్ద BJP భారీ ధర్నా చేపడుతోంది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలంటూ ఇంతకుముందే ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీనిపై వారం క్రితం పార్టీ స్టేట్ లీడర్లతోపాటు కార్యకర్తలు సైతం పెద్దయెత్తున ఉద్యమించారు. అయినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఈరోజు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు ముఖ్య నేతలంతా ఈ ధర్నాకు అటెండ్ అవుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో లక్ష బెడ్ రూమ్ లతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పేద కుటుంబాలకు ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు వాటిని అందజేయలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
ఈ ధర్నాకు భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేస్తున్నారు.