మజ్లిస్ పార్టీకి లొంగిపోవడం వల్లే తెలంగాణ విమోచనపై KCR నోరు మెదపడం లేదని, ఈ ఉత్సవాల్ని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్నామని BJP రాష్ట్ర ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉత్సవాలు జరపాలంటూ మాజీ CM రోశయ్యపై అప్పట్లో విరుచుకుపడ్డ KCR.. ఇప్పుడు నోరెందుకు తెరవడం లేదని విమర్శించారు. విమోచన వేడుకలు నిర్వహించాలని రాష్ట్రంలోని సర్పంచులందరికీ లెటర్స్ రాస్తున్నామని, ఈ దినోత్సవంలో మొదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి BRS అంటూ కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో MIMకు కాంగ్రెస్ బానిస అయితే ఇప్పుడు BRS వాళ్లకు తొత్తుగా మారిందని ఫైర్ అయ్యారు.
విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి.. సెప్టెంబరు 17న హైదరాబాద్ లో జరిగే వేడుకలకు హోంమంత్రి వస్తున్నారని మరోసారి గుర్తు చేశారు. అమిత్ షాతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర CMలను ఆహ్వానిస్తున్నామని.. కానీ ఒవైసీ పర్మిషన్ ఇస్తేనే కేసీఆర్ వచ్చేటట్లున్నారని కామెంట్ చేశారు.