కేసీఆర్-కవిత(Kavitha) మధ్య సాగిన లేఖాస్త్రం ఒక డ్రామాకు నిదర్శనమని BJP విమర్శించింది. వారిద్దరి మధ్య మాటలు లేవనడానికి ఆ లేఖనే రుజువని(Proof) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కేడర్‌ను కలవడం లేదని స్వయంగా ఆయన కుమార్తెనే చెప్పారని, ఇంతకన్నా రుజువు ఇంకేముంటుందన్నారు. BRS పార్టీ కనిపించకుండా పోతోందని, అయినా ఆమె లెటర్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో డాడీ-డాటర్, డాడీ-సన్, డాడీ-సన్ ఇన్ లా వ్యవస్థ నడుస్తోందని విమర్శలు చేశారు.