కమలం పార్టీ కేంద్ర పెద్దలు రాష్ట్ర ఎన్నికల ప్రచారం(Election Campaign)లో బిజీబిజీగా గడపనున్నారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ నేతల రాక రేపటినుంచి మొదలవుతుంది. ఈ నెల 23 తర్వాత 50 బహిరంగసభలు నిర్వహించేలా రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం తర్వాత కీలక నేతలంతా ఇక్కడ ప్రచారం చేయనుండగా.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు తెలంగాణకు వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాష్ట్రంలో అడుగుపెడుతున్నారు.
రేపు రాత్రి 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం అమిత్ షా.. ITC కాకతీయ హోటల్ లో బస చేస్తారని రాష్ట్ర పార్టీ నేతలు తెలిపారు. 18 నాడు BJP మ్యానిఫెస్టోను షా రిలీజ్ చేసిన తర్వాత గద్వాల సభకు అటెండ్ అవుతారు. అక్కణ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండకు చేరుకుంటారు. నల్గొండలో సభ ముగించుకుని సాయంత్రం నాలుగింటికి వరంగల్ సభకు అమిత్ షా హాజరవుతారు. తిరిగి ITC కాకతీయకు చేరుకుని అక్కడ MRPS నాయకులతో భేటీ అవుతారు.