రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై కన్నుపడినట్లుందని BJP శాసనసభాపక్ష(Lesislative) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. MLAలను చేర్చుకోవడం, సబ్ కమిటీల్లో ఉండటంతోపాటు అన్ని చోట్లా ఆయనే ముందుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో మూడు వర్గాలు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశాయన్నారు.
కొడంగల్, మక్తల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ల కాంట్రాక్టులను పొంగులేటికి చెందిన సంస్థకు ఇవ్వాలనే ఆలోచన మంచిది కాదన్నారు. కర్ణాటక డిప్యూటీ CM డి.కె.శివకుమార్ మాదిరిగానే రాష్ట్రంలో పొంగులేటి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కన్నా కుర్చీలాట, సెకండ్ పొజిషన్ పైనే కొందరి కన్ను పడిందన్నారు.