
భారతీయ జనతా పార్టీ మరో ఆరుగురు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితా(Fourth List)ను BJP విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో 52, సెకండ్ లిస్ట్ లో ఒకరు, థర్డ్ లిస్ట్ లో 35 మందితో కలిపి ఇప్పటివరకు 88 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తాజాగా ప్రకటించిన ఈ ఆరుగురితో ఆ సంఖ్య 94కు చేరుకుంది. పొత్తుల్లో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలు కేటాయించిన కమలం పార్టీ… మిగిలిన సీట్లకు సైతం క్యాండిడేట్స్ లిస్ట్ ను రిలీజ్ చేయాల్సి ఉంది.
ఆరుగురు అభ్యర్థులు వీరే
మేడ్చల్ – ఎన్.రాంచందర్ రావు
నాంపల్లి – రాహుల్ చంద్ర
శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్
కంటోన్మెంట్ – కృష్ణప్రసాద్
సంగారెడ్డి – పులిమామిడి రాజు
పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్ కుమార్