భారతీయ జనతాపార్టీ తమ లోక్ సభ అభ్యర్థులకు సంబంధించి రెండో జాబితా(Second List)ను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరు స్థానాలకు అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం(High Command) ఖరారు చేసింది. అయితే మరో రెండు స్థానాలైన ఖమ్మం, వరంగల్ ను ఖాళీగా ఉంచింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను ఫస్ట్ లిస్ట్ లో 9 మందికి అభ్యర్థుల్ని ప్రకటించింది.
ఇటీవలే పార్టీలో చేరిన గోడెం నగేశ్ తోపాటు గోమాస శ్రీనివాస్, సీతారాం నాయక్, సైదిరెడ్డికి టికెట్లు దక్కాయి. ఇప్పుడు ప్రకటించిన ఆరుగురిలో నలుగురు కొత్తగా చేరినవారే ఉన్నారు.
నియోజకవర్గం – అభ్యర్థి
ఆదిలాబాద్- గోడె నగేశ్
పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్
మహబూబాబాద్ – సీతారాం నాయక్
నల్గొండ – సైదిరెడ్డి
మెదక్ – రఘునందన్ రావు
మహబూబ్ నగర్ – డీకే అరుణ