భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికల(General Elections) మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర’ పేరిట విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. దేశ ప్రగతి, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు కాగా.. దీన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మందితో కూడిన కమిటీ రూపొందించింది. మోదీ గ్యారంటీ, 2047 వికసిత భారత్ లక్ష్యంగా 14 అంశాలతో ఈ మేనిఫెస్టో ఉంది.
మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలివే…
విశ్వబంధు, సురక్షిత భారత్, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్, గుడ్ గవర్నెన్స్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, సంతులిత వృద్ధి, సాంకేతిక వికాసం, హై-లెవెల్ ట్రెయినింగ్, సుస్థిర భారత్, సమృద్ధ భారత్, సాంస్కృతిక వికాసం, స్వస్థ భారత్, క్రీడా వికాసం.
పథకాలు ఇలా…
వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్
ఆయుష్మాన్ స్కీమ్ లోకి 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులు
70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
దివ్యాంగుల ప్రత్యేక అవసరాలతో ఇళ్ల నిర్మాణం
PM ఆవాస్ యోజన కొనసాగింపు
3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు
భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్
సోలార్ పవర్ కు ప్రోత్సాహం
PM సూర్యఘర్ స్కీమ్ కు కోటి మంది అప్లై
ఇంట్లో తయారైన కరెంట్ అమ్ముకునే ఏర్పాట్లు
ముద్ర స్కీమ్ కింద ఇచ్చే లోన్ రూ.20 లక్షలకు పెంపు
చిరు వ్యాపారులకు మరిన్ని రుణాలు
మురికివాడల్లో నివసించే పేదలకు ఇళ్లు
ముత్యాలు, సముద్ర నాచు సాగు దిశగా మత్స్యకారులకు ప్రోత్సాహం
వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం
న్యూట్రిషన్ హబ్ గా భారత్
ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా భారత్
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు
వచ్చే పదేళ్లలో 17 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు
ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి
వందేభారత్ విస్తరణ
తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
అంతరిక్ష రంగంలో భారత్ ఖ్యాతి పెంచేలా ప్లాన్
జమిలి ఎన్నికలు