అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న BJP… హైదరాబాద్ లో నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ కు 11 రాష్ట్రాల ప్రెసిడెంట్స్ అటెండ్ అవుతున్నారు. JP నడ్డా ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్ లో వివిధ రాజకీయ అంశాలు చర్చకు రానుండగా.. కీలక రాష్ట్రాల ప్రెసిడెంట్లు హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలతోపాటు పార్లమెంటు ఎలక్షన్స్ కు కీలకంగా మారే రాష్ట్రాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
మూడు రోజుల క్రితమే నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. వీటితోపాటు ఎన్నికల ఇంఛార్జి, సహాయ ఇంఛార్జిల నియామకం కూడా పూర్తయింది. అటు తెలంగాణకు సంబంధించి ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ కు బాధ్యతలు కట్టబెట్టింది. ఇప్పుడు ఈ భేటీ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రాధాన్యాంశంగా మారింది.