హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూముల వేలాన్ని నిరసిస్తూ కమలం పార్టీ ఆందోళనకు దిగింది. HCU సందర్శనకు బయల్దేరిన MLAలు, BJP నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. దీంతో హైదర్ గూడ MLA క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, BJP కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పచ్చని ప్రకృతిని ప్రభుత్వమే నాశనం చేస్తున్నదంటూ నేతలు విమర్శించారు.