రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ(BJP) ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొలి దశలో భాగంగా వెల్లడిస్తున్న పేర్లలో కొన్నింటిని రాష్ట్రంలోని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థిత్వాల(Candidature)ను పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఇందులో సీనియర్లకు పట్టం కడుతూ BJP హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు వాటి పేర్లను బయటకు తెలియజేశారు.
ప్రధాని మోదీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఆధ్వర్యంలో సీనియర్ నేతలంతా సమావేశమై రెండ్రోజుల క్రితం విస్తృతంగా చర్చ నిర్వహించారు. తొలి దశ(First Phase)లో విడుదల చేసే పేర్లకు సంబంధించి ఆయా రాష్ట్రాల కీలక నేతల్ని ఢిల్లీ పిలిపించుకుని సమాలోచనలు జరిపారు. 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. తొలి దశలో 195 మందితో లిస్టు ప్రకటించగా.. అందులో తెలంగాణ నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి మరోసారి పోటీ చేస్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో ఉంటారు.
రాష్ట్రంలో పోటీకి దిగబోతున్న అభ్యర్థులు వీరే…
క్ర.సంఖ్య | అభ్యర్థి పేరు | నియోజకవర్గం |
1. | సికింద్రాబాద్ | జి.కిషన్ రెడ్డి |
2. | కరీంనగర్ | బండి సంజయ్ |
3. | నిజామాబాద్ | ధర్మపురి అర్వింద్ |
4. | మల్కాజిగిరి | ఈటల రాజేందర్ |
5. | చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
6. | భువనగిరి | బూర నర్సయ్యగౌడ్ |
7. | జహీరాబాద్ | బీబీ పాటిల్ |
8. | హైదరాబాద్ | మాధవీలత |
9 | నాగర్ కర్నూల్ | పి.భరత్ ప్రసాద్ |
పలు రాష్ట్రాల్లో ప్రముఖుల పోటీ…
వారణాసి- నరేంద్ర మోదీ
గాంధీనగర్ – అమిత్ షా
లఖ్ నవూ – రాజ్ నాథ్ సింగ్
కోటా – ఓం బిర్లా
అరుణాచల్ ప్రదేశ్(వెస్ట్) – కిరణ్ రిజుజు
పోర్ బందర్ – మన్ సుఖ్ మాండవీయ
దిబ్రూగఢ్ – శర్వానంద్ సోనోవాల్
గుణ – జ్యోతిరాదిత్య సింధియా
విదిశ – శివరాజ్ సింగ్ చౌహాన్
బికనీర్ – అర్జున్ రామ్ మేఘ్వాల్
జోధ్ పూర్ – గజేంద్రసింగ్ షెకావత్