BRS పాలనలో పేపర్ లీకేజీలు.. కాంగ్రెస్ హయాంలో అసలు ఆశలే లేవని(హోప్ బ్రేకేజ్) అని కమలం పార్టీ ఆరోపించింది. గ్రూప్-1 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ప్రకటనలకే పరిమితం, ఢిల్లీ పర్యటనలు, దావోస్ పెట్టుబడులంటూ ప్రచారం చేసుకోవడం అలవాటైందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాదిన్నరగా బెనిఫిట్స్ అందట్లేదన్నారు. 11 ఏళ్ల నాడు గ్రూప్-1 నిర్వహిస్తే ఇప్పటికే ఆ అధికారులు కన్ఫర్డ్ IAS, IPSలు అయ్యేవారన్నారు.