ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరుకాని రాహుల్ గాంధీపై BJP విరుచుకుపడింది. ‘రాజ్యాంగం నచ్చదు.. ప్రజాస్వామ్యం గిట్టదు.. ప్రమాణ స్వీకారానికి రారు.. ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవాన్నే బాయ్ కాట్ చేశారు.. మలేషియాలో గడపడానికి సమయం ఉంది.. స్వాతంత్ర్య దినోత్సవం, రాజ్యాంగ బద్ధ వ్యక్తిని తిరస్కరించేవారు ప్రజా జీవితంలో ఉండేందుకు అర్హులు కాగలరా..’ అంటూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. అయితే ఆయన గుజరాత్ లోని జునాగఢ్ లో పార్టీ కార్యక్రమం కోసం వెళ్లడంతో రాలేకపోయారని కాంగ్రెస్ చెబుతోంది.