మరోసారి అధికారం కట్టబెడితే TSPSCని ప్రక్షాళన చేస్తామని KTR చెప్పడంపై BJP దీటుగా స్పందించింది. కేటీఆర్ చేసిన ప్రకటనపై కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. TSPSCతో సంబంధం లేదని నెల క్రితం వరకు చెప్పారు.. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త రాగం అందుకున్నారు.. మాకేం సంబంధం లేదన్న వ్యక్తి ఎలా ప్రక్షాళన చేస్తారు.. ఇన్నాళ్లూ అధికారంలో ఉండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
నిరుద్యోగులను నిండా ముంచింది
రాష్ట్రంలోని నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం నిండా ముంచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. BRS సర్కారుకు ఉద్యోగాల భర్తీపై శ్రద్ధ లేదన్న ఆయన.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఆ మేరకే రిక్రూట్ మెంట్లు చేపడతామన్నారు.