ప్రధాని మోదీ మేనియాను మరోసారి చాటి రాష్ట్రంలో ఈ సారి సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల కదనరంగంలోకి BJP దిగుతున్నది. 17 లోక్ సభ స్థానాలు(Loksabha Segments) చుట్టివచ్చేలా 4,238 కిలోమీటర్ల మేర రథయాత్ర(Ratha Yaatra)కు శ్రీకారం చుట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి ప్రచార రథాలను ప్రారంభించారు. 17 సెగ్మెంట్ల(Constituencies)ను ఐదు క్లస్టర్లుగా విభజించి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగేలా ఈ యాత్రలు నిర్వహిస్తున్నారు.
మరోసారి సంకల్పయాత్ర…
మోదీ సర్కారుకు హ్యాట్రిక్ కట్టబెట్టాలన్న టార్గెట్ తో BJP.. మరోసారి రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర మొత్తాన్ని రోడ్ షోల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, MP లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి సీనియర్లంతా ఆయా క్లస్టర్లలో జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ సాధించిన విజయాల్ని ప్రజలకు వివరించేలా విజయసంకల్ప రథయాత్రలు ఉండనున్నాయి. బస్సు యాత్రల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరిగే కార్నర్ మీటింగ్స్(Corner Meetings)కు BJP పాలిత రాష్ట్రాల CMలతోపాటు కేంద్ర మంత్రులు, నేషనల్ పార్టీ లీడర్లు అటెండ్ అవుతారు.
హిమంత బిశ్వశర్మ…
కుమురం భీం క్లస్టర్ యాత్రను ఆదిలాబాద్ జిల్లా ముథోల్ లో… అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభిస్తారు. గోవా CM ప్రమోద్ సావంత్ వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.