BJP అధ్యక్షుల ఎంపిక కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్రాలకు చీఫ్(Presidents)ల్ని నియమించాల్సి ఉంది. ఉగాది నూతన సంవత్సరంలో పేర్లను ప్రకటించే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ కౌన్సిల్ భేటీలు ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఆలోపే జాతీయ అధ్యక్షుణ్ని ప్రకటించి, కౌన్సిల్లో ఆమోద ముద్ర వేయాలి. ముందునుంచీ పార్టీలో ఉన్నవారికే అప్పగిస్తారా, లేక కొత్తవారికి ప్రాధాన్యముంటుందా అన్నది తేలాలి. నేషనల్ ప్రెసిడెంట్ విషయంలో ఇంకో ఆలోచన లేకపోగా, రాష్ట్రాల అధ్యక్షుల విషయంలోనే చర్చ సాగుతోంది. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయం చేసుకునేలా ఉంటేనే ఎక్కువ మార్కులు పడతాయన్న చర్చ జోరందుకుంది.
పూర్తి స్టోరీ కోసం…. https://justpostnews.com/politics/bjp-presidents-selection/