దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్(UP)లో అధికార పార్టీ BJPకి లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 64 సీట్లు గెలిచిన NDA కూటమి 2023 ఎన్నికల్లో 36కే పరిమితమైతే.. సమాజ్ వాదీతోకూడిన కాంగ్రెస్ కూటమి(Alliance) 43 చోట్ల గెలిచింది. 400 స్థానాలు వస్తాయని ఆశలు పెట్టుకుంటే 300 కూడా దాటలేక ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది.
మూడేళ్లలో 15 పేపర్ లీక్ లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు రిక్రూట్మెంట్లు, నేతల మధ్య విభేదాలు, CMపై అతి విశ్వాసం, పరిపాలనపై పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి అంటూ UP బీజేపీ 15 పేజీల రిపోర్టును తయారు చేసింది. అయోధ్య, అమేథీ సహా అని సెగ్మెంట్లలో 40 వేల శాంపిల్స్ తీసుకున్నారు. RSSతో సంబంధాలు బాగానే ఉన్నా MLAలను పక్కనపెట్టి పూర్తి అధికారాల్ని కలెక్టర్లకు ఇవ్వడమే 8% ఓట్లు తగ్గేలా చేశాయని హైకమాండ్ కు నివేదిక పంపింది.
కుర్మీ, మౌర్య ఓట్లను రాబట్టుకోవడంలో తమ కంటే సమాజ్ వాదీ సక్సెస్ కాగా, దళితులు BSP దూరమవడం కాంగ్రెస్ కు లాభించిందని రిపోర్టులో వివరించింది. రామ మందిర ప్రతిష్ఠాపనతో బాగా కలిసివస్తుందని భావించినా.. రిజర్వేషన్లు తగ్గిపోతాయన్న ప్రచారం అయోధ్య, వారణాసిలో బలం తగ్గివడానికి కారణమని గుర్తించింది. యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్ పూర్లో 13 స్థానాలకు ఆరింటిని మాత్రమే BJP గెలుచుకుంది.