BJP రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారైనట్లే. సీనియర్ నేత రాంచందర్ రావు పేరును అధిష్ఠానం(High Command) ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మాజీ MLC రాంచందర్ రావు నామినేషన్ వేసేందుకు ఇక సిద్ధమైనట్లేనన్న మాటలు వినపడుతున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది. అందుబాటులో ఉండాలంటూ రాష్ట్ర నేతలను పార్టీ ఆదేశించింది. పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడ్డ వేళ అంతా సీనియర్లే అయినందున ఎవరు అధ్యక్షుడవుతారన్నది సస్పెన్స్ గా మారింది. అరుణ, అర్వింద్, ఈటల వంటి నేతలు పోటీలో ఉంటారని భావించినా.. కొత్తవారికి ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న మాట వినపడింది. ఊహించినట్లుగానే సీనియర్ నేత రాంచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది.