లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల విషయంలో రెండు కూటముల(Alliances) మధ్య గందరగోళం ఏర్పడిన వేళ.. ఇరు వర్గాల్లోని ప్రధాన పార్టీలు(కమలం, కాంగ్రెస్) ఎదురుదాడికి దిగుతున్నాయి. తమకు ఉప సభాపతి(Deputy Speaker) ఇస్తేనే సభాపతి పదవికి మద్దతు తెలుపుతామని ఇండియా కూటమి అంటున్నది. ఈ సంప్రదాయం ఎన్నడూ లేదని, ఎక్కడా జరగట్లేదని అధికార NDA కూటమి చెబుతున్నది.
లెక్కలతో బీజేపీ…
మమ్మల్ని డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని అడుగుతున్నారు.. మరి మీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పదవికి వేరే పార్టీ వాళ్లను తీసుకున్నారా అంటూ కమలం పార్టీ ఎదురుదాడికి దిగింది. దేశంలో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు తొమ్మిదింటికిగాను రెండు(తెలంగాణ, జార్ఖండ్) చోట్ల డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ(Vacant)గా ఉంటే… ఏడు రాష్ట్రాలు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం తమకు అనుకూలమైన పార్టీల వారికే పదవులు దక్కాయి.