చండీగఢ్ మేయర్(Chandigarh Mayor) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. BJP అభ్యర్థి హర్ ప్రీత్ కౌర్ బబ్లా.. కూటమి అభ్యర్థి ప్రేమ్ లతపై విజయం సాధించారు. BJPకి 19 ఓట్లు వస్తే, ఆ రెండు పార్టీల అలయెన్స్ కు 17 ఓట్లు పోలయ్యాయి. చండీగఢ్ కార్పొరేషన్ లో 35 మంది కౌన్సిలర్లు ఉండగా, ఎక్స్-అఫీషియో కింద పార్లమెంటు సభ్యుడు(MP)కి ఓటుంది. దీంతో కార్పొరేషన్ లో మొత్తం 36 ఓట్లున్నాయి. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి 17, ఆమ్ ఆద్మీకి 13, కాంగ్రెస్ కు 6 మంది సభ్యుల బలం ఉంది. ఆప్-కాంగ్రెస్ కు సంఖ్యా బలం ఎక్కువున్నా ఆ పార్టీల అభ్యర్థి మాత్రం ఓటమి పాలయ్యారు. ఈ రెండు పార్టీలకు చెందిన ముగ్గురు సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు.