
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఛైర్ పర్సన్ గా అంకం మౌనిక(బీజేపీ), వైస్ ఛైర్మన్ గా మహ్మద్ షోయబ్(బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. కమలం పార్టీకి బీఆర్ఎస్ మద్దతివ్వడంతో కాంగ్రెస్ కు చుక్కెదురైంది. మొత్తం 12 మంది కౌన్సిలర్లకు గాను ఏడుగురు సభ్యులు మౌనికకు అనుకూలంగా చేతులెత్తారు. ప్రతిగా బీజేపీ సభ్యులు సైతం వైస్ ఛైర్మన్ గా షోయబ్ కు సహకరించారు. మున్సిపాల్టీల ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి వరుస వివాదాలతో ఖానాపూర్ ఎన్నిక వాయిదాలు పడింది. నిన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ఎన్నికలు పూర్తి కాగా, ఖానాపూర్ మరోసారి వాయిదా పడటంతో ఈరోజు తిరిగి నిర్వహించారు.