తెలంగాణ విద్యాశాఖపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన రీతిలో మాట్లాడటం… దానికి కౌంటర్ గా తెలంగాణ మంత్రులు(Ministers) విరుచుకుపడటంతో… దానిపై రెండ్రోజుల తర్వాత రెస్పాండ్ అవుతానని బొత్స అన్నారు. ఏపీలో టీచర్ల ఖాళీలను గుర్తించి వాటి రిక్రూట్ మెంట్ పై తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తెలంగాణ విద్యాశాఖలో అక్రమాలు, కుంభకోణాలు, చూచిరాతలే ఉంటాయని… TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీలే ఇందుకు ఎగ్జాంపుల్(Example) అని బొత్స సత్యనారాయణ గురువారం నాడు సంచలన రీతిలో విమర్శలు చేశారు. మా విద్యాశాఖనే విమర్శిస్తావా అంటూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్… బొత్సపై విరుచుకుపడ్డారు. క్షమాపణ చెప్పేదాకా తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. దీనిపై శుక్రవారం రెస్పాండ్ అయిన బొత్స… రెండు రోజుల తర్వాత తెలంగాణ మంత్రులకు బదులిస్తానన్నారు.