BRS నేతలపై విమర్శలు చేసిన కల్వ కుంట్ల కవిత(Kavitha)పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. హరీశ్, సంతోశ్ రావును నిన్న తీవ్రంగా విమర్శించడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సోమ భరత్ కుమార్ తెలంగాణ భవన్ లో ప్రకటించారు. కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.