కులగణన తప్పుల తడకగా ఉందని, వెంటనే రీ-సర్వే(Re-Survey) చేపట్టాలని BRS బీసీ నేతలు డిమాండ్ చేశారు. KTR నేతృత్వంలో తెలంగాణ భవన్ లో సమావేశమైన MPలు, MLAలు, మాజీ ప్రజాప్రతినిధులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు చేపట్టబోయే పోరాటంపై KTRకు వివిధ అంశాల్ని వివరించారు. ఐదున్నర శాతం జనాభాను తక్కువగా చూపించి 22 లక్షల మంది లేకుండా చేశారని KTR విమర్శించారు. తమ హయాంలో స్థానిక సంస్థల్లో 50 రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని, పొన్నాల, శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న సహా BC ప్రముఖులు, పార్టీ MLAలు భేటీకి హాజరయ్యారు.
డిమాండ్లివే…
జనాభా తగ్గించడంపై CM రేవంత్ క్షమాపణ చెప్పాలి.
కులగణన అశాస్త్రీయం కాబట్టి రీసర్వే చేయాలి.
రీసర్వేతో సరైన లెక్కలు తేల్చాలి.
బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా 42 శాతాన్ని కేటాయించాలి.
BCలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలి.