కమలం పార్టీలో చేరే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అచ్చంపేట మాజీ MLA గువ్వల బాలరాజు. BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును కలిసిన ఆయన.. ఈ నెల 11న కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీలో చేరిన గువ్వల.. 2009లో మొదటిసారి నాగర్ కర్నూల్ MPగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించారు. ప్రస్తుతం BRS నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన… ఈ మధ్యే పార్టీని వీడారు. గతంలో బండి సంజయ్ సహా కమలం పార్టీ నేతల్ని తీవ్రంగా విమర్శించిన ఈ మాజీ MLA.. ఇప్పుడు అదే పార్టీలో చేరుతుండటం ఎలాంటి పరిమాణాలకు దారితీస్తుందోనన్న ప్రచారం జరుగుతోంది.