లోక్ సభ ఎన్నికల తర్వాత BRS పార్టీయే ఉండదంటూ చెప్పిన కాంగ్రెస్(Congress) లీడర్లు.. ఆ దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, కె.కేశవరావు వంటి సీనియర్(Senior) నేతల్ని చేర్చుకున్న హస్తం పార్టీ.. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై దృష్టిపెట్టింది. ఆయన ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు.
రైతుల కోసం పోచారం ఎన్నో పనులు చేశారని, అందుకే ఆయన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామని CM అన్నారు. దీనిపై గులాబీ పార్టీ(BRS) నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ స్పీకర్ ఇంటికి CM వెళ్లడాన్ని నిరసిస్తూ ఆయన నివాసం వద్ద నినాదాలు చేశారు.
పార్టీ మారుతూ…
స్వయంగా ముఖ్యమంత్రే రావడంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు హస్తం పార్టీలో చేరారు.