మాజీ ముఖ్యమంత్రి KCR.. పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి నివాసానికి KTR, హరీశ్, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన కేసుపై ప్రతికూల ఆదేశాలు రావడంతో.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో CS, ఇరిగేషన్ కార్యదర్శి, కాళేశ్వరం కమిషన్ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ప్రతివాదుల కౌంటర్ పై సమాధానమిచ్చేందుకు పిటిషనర్లైన KCR, హరీశ్ కు సైతం వారం గడువిచ్చింది. మొత్తంగా 5 వారాల తర్వాత మరోసారి కేసు విచారణకు వస్తుంది.