పార్టీ ఫిరాయింపులతో ఇబ్బందికర పరిస్థితికి చేరుకున్న BRS… నష్ట నివారణ చర్యలను వేగవంతం చేసింది. మరింతమంది వెళ్లిపోకముందే ఫిరాయింపుదారులపై వేటు వేయించే రూట్లో పడింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ MLA దానం నాగేందర్ పై అనర్హత(Disqualification) వేటు వేయాలంటూ విపక్ష MLAలంతా అసెంబ్లీ బాట పట్టారు. శాసనసభ స్పీకర్, కార్యదర్శిని కలిసేందుకు వెళ్తే అక్కడ ఆ ఇద్దరూ అందుబాటులో లేకుండా పోయారు.
దీంతో…
స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అనర్హత పిటిషన్(Petition) తీసుకోవాలని డిప్యూటీ సెక్రటరీని BRS ఎమ్మెల్యేలు కోరారు. ఆ ఇద్దరూ లేనప్పుడు మీరు తీసుకోవచ్చంటూ పట్టుబట్టారు. కానీ అనర్హత పిటిషన్ తీసుకునే అర్హత(Eligibility) తనకు లేదని డిప్యూటీ సెక్రటరీ స్పష్టం చేశారు. దీంతో ఆయనపై గులాబీ పార్టీ MLAలు తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల(Rules) ప్రకారం ఆ పిటిషన్ ను తాను తీసుకోలేనని ఉప కార్యదర్శి చెప్పడంతో చేసేదిలేక అక్కణ్నుంచి ఎమ్మెల్యేలంతా వెనుదిరిగారు.