ఒకవైపు BJP నేతృత్వంలోని NDA కూటమి.. మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి.. కళ్లముందు ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఇలాంటి పరిస్థితుల్లో BRS స్టాండ్ ఏంటనే దానిపై అందరిలోనూ చర్చ నడిచింది. కానీ ఈ ఇద్దరికీ దూరంగా ఉండాలని అధినేత KCR నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకే దూరంగా ఉండాలని గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో నోటా(NOTA)కు ఓటేయాలని తొలుత భావించినా ఆ ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని భావించింది.