బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి పొత్తుల బాంబు పేల్చారు. ఆ పార్టీతో పొత్తుతోనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలన్న భారత్ రాష్ట్ర సమితి(BRS) ఆశలపై నీళ్లు చల్లుతూ నిర్ణయం తీసుకున్నారు. BSP రాష్ట్ర పెద్ద ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మొన్న KCRను కలిసి పొత్తుల(Alliance) సంకేతాలు ఇచ్చిన సంగతి చూశాం. కానీ ఇప్పుడా ఆ ఆలోచనకు అధినేత్రి చెక్ పెట్టారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తమ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుందో ఆమె ‘X’ ద్వారా ట్వీట్ చేశారు.
ఒంటరిగానే…
కేసీఆర్, ప్రవీణ్ కుమార్ భేటీ తర్వాత ఇక ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమేనని అనుకున్నారంతా. BSP మినహా రాష్ట్రంలోనూ అన్ని వర్గాల్లో ఇది వాస్తవ రూపం దాల్చుతుందన్న మాటలు వినపడ్డాయి. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి సహా ఇతర ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని మాయావతి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కూటమి, థర్డ్ ఫ్రంట్(Third Front) అంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆమె.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే BSP పోటీ చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.