రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధు నిధులు ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈసారి పోడు రైతులకు రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించి దాని అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. పోడు భూముల పట్టాల కోసం రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులు ఎదురుచూస్తున్నారు. వారి కష్టాలు తీరుస్తామని స్వయంగా సీఎం ఎన్నోసార్లు సభల్లో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం పట్టాలు ఇవ్వడమే కాకుండా వారికి రైతుబంధు కూడా అందాలని సూచించారు. ఇలా పట్టాలతోపాటు రైతుబంధు కూడా రావడంతో పోడు రైతులకు ‘బంపర్ ఆఫర్’గా మిగిలిపోనుంది.
Related Stories
December 22, 2024
December 21, 2024