రైతుల పంట రుణాలు మాఫీ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం(State Cabinet) నిర్ణయం తీసుకుంది. రుణమాఫీకి 2023 డిసెంబరు 9ని కటాఫ్ తేదీ(Cut-Off Date)గా నిర్ణయించింది. కాంగ్రెస్ గ్యారంటీల్లో భాగంగా రుణాలు(Loans) మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. వచ్చే పంద్రాగస్టులోపు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేస్తామని మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు మాట ఇచ్చారు. ఆ మేరకు మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఎప్పట్నుంచంటే…
2018 డిసెంబరు 11 నుంచి 2023 డిసెంబరు 9 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. BRS ప్రభుత్వం 2014, 2018లో మాత్రమే రుణాలు మాఫీ చేసిందని కానీ తాము ఐదేళ్లకు మాఫీ చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.31,000 కోట్ల రూపాయలు సేకరిస్తామన్నారు.