శాసనసభ ఎన్నికల హామీలో భాగమైన వరికి బోనస్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నది. వచ్చే సీజన్ నుంచే క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. సన్న రకాలు పండించిన రైతులందరికీ బోనస్ ఇస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమై(Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. జూన్ 2న జరిపే రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించబోతున్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర(MSP)కే కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.