ప్రధానమంత్రి మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న విశ్వకర్మ పథకానికి.. కేంద్ర కేబినెట్ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చింది. ఈ స్కీమ్ కోసం రూ.13,000 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా చేతివృత్తులు చేసుకునేవారికి సబ్సిడీ(Subsidy) లోన్లు(Loans) అందిస్తారు. ‘విశ్వకర్మ’ ద్వారా చేతివృత్తులు చేసే వారికి రూ.2,00,000 వరకు రుణాలు ఇవ్వనుండగా.. రోజుకు రూ.500 స్టైపెండ్(Stipend) అందిస్తూ ట్రెయినింగ్ ఇస్తారు. ఈ ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తారు. అనంతరం 5 శాతం వడ్డీతో రూ.1,00,000ను కేంద్ర ప్రభుత్వం రుణంగా చెల్లిస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన లోన్ ను సద్వినియోగం చేసుకుంటే తర్వాత మరో రూ.1,00,000ను అకౌంట్లలో వేస్తారు.
మరోవైపు ‘పీఎం e-బస్ సేవ’ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల e-బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోస రూ.77,613 కోట్లు కేటాయించాలని తీర్మానించగా దేశవ్యాప్తంగా 100 టౌన్లలో వీటిని ప్రవేశపెట్టాలని చూస్తోంది.