
రాష్ట్ర కేబినెట్ మీటింగ్ రేపు జరగనుంది. మామునూరు ఎయిర్ పోర్టు, హైదరాబాద్ మెట్రో రైలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. సోమవారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులపై చర్చ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన ప్రాంతాలపై చర్చించి వారిని ఆదుకునే విధానాలపై ఇందులో చర్చ చేపట్టే అవకాశం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్, విపత్తులు, నష్టం అంచనాలపై కేబినెట్ సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో వరద నష్టం అంచనాలకు సంబధించి రేపు కేంద్ర బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.