జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో(Bye) గెలిచిన నవీన్ యాదవ్ కు ఎన్నికల సంఘం ధ్రువీకరణ పత్రం అందజేసింది. నియోజకవర్గ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించింది. 24,729 ఓట్ల ఆధిక్యంతో నవీన్ గెలిచారు. హస్తం పార్టీకి 98,988, BRS అభ్యర్థి మాగంటి సునీతకు 74,259, BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. ఏ రౌండ్లోనూ BRS పోటీ ఇవ్వకపోగా, BJP అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు.