కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిధుల కొరత ఏర్పడిందని, తమ ఖాతాల్ని స్తంభింపజేయడమే(Freeze) ఇందుకు కారణమని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ ఇంతకుముందే ఆరోపించారు. అయితే వీటిని నరేంద్ర మోదీ సర్కారు కొట్టిపడేసింది. కాంగ్రెస్ చెబుతున్నవన్నీ అబద్ధాలని క్లారిటీ ఇచ్చింది. దేశంలో పార్టీ వ్యవహారం ఇలా ఉంటే ఈ మధ్యనే అధికారం చేపట్టిన కర్ణాటకలో(Karnataka)నూ హస్తం పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందట.
వంశాంకురాలు, బంధువులకే…
తాజా లోక్ సభ ఎన్నికల్ని(General Elections) ఎదుర్కొనేందుకు సిద్ధరామయ్య సర్కారులోని లీడర్ల వద్ద డబ్బులు లేవట. దీంతో టికెట్లను వేరే వ్యక్తులకు కాకుండా పార్టీలోని మంత్రులు, ఇతర సీనియర్ నేతల కుటుంబ సభ్యులకే ఇవ్వాలని నిర్ణయించి దాన్నే అమలు చేయబోతున్నారు. 24 మంది అభ్యర్థుల్లో మంత్రులు, ఇతర పార్టీ నేతల బంధువులే 8 మంది ఉన్నారు. తొలుత మంత్రులనే లోక్ సభకు రంగంలోకి దింపాలని భావించినా, అసెంబ్లీ సెగ్మెంట్లు ఖాళీ(Vacancies) అయ్యే ప్రమాదం పొంచి ఉందని గుర్తించింది. తద్వారా మెజారిటీ తగ్గిపోయి ఖాళీ ఏర్పడ్డ స్థానాల్లో BJP గెలిస్తే అసలుకే ఎసరు వస్తుందని అనుమానించింది.
రాచరిక పాలిటిక్స్ అంటూ…
కాంగ్రెస్ అనుసరించబోతున్న విధానంతో రాచరిక వ్యవస్థ(Dynastic Politics)ను గుర్తుకు తెస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు(Allegations) వస్తున్నాయి. అయినా మంత్రుల కుటుంబీకులకే టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇందుకు ప్రధాన కారణం మంత్రుల కుటుంబీకులైతే ఆ బాధ్యతల్ని అమాత్యులపైనే వేయొచ్చట. ఇందుకుగాను జిల్లా ఇంఛార్జి మంత్రులే ఒక్కో సెగ్మెంట్ ను చూసుకునేలా ప్లానే వేస్తూనే.. ఒకవేళ వారు ఓడితే సదరు మంత్రుల్నే బాధ్యులుగా చేసే ఆలోచనలో ఉన్నారు.
ఎగ్జాంపుల్స్ ఇవే…
మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తనయుడు మృణాల్ ను బెళగావి నుంచి, మరో మంత్రి సతీశ్ జర్కిహోలి కుమార్తె ప్రియాంకను చిక్కోడి నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం(Leadership) ఉంది. తమ పిల్లల(Kin) రాజకీయ భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులదే కీలక పాత్ర కాబట్టి మంచి ఓటింగ్ వస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నది. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాలోచనలు జరుపుతామని CM సిద్ధరామయ్య సూచనప్రాయంగా తెలియజేశారు.