
రాష్ట్రంలోని ఇద్దరు BJP లీడర్లకు ‘Y కేటగిరీ’ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. MP ధర్మపురి అర్వింద్, స్టేట్ పార్టీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కు.. ఇక నుంచి కేంద్ర పోలీసు దళంతో రక్షణ కల్పిస్తారు. నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ కు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆయనకు ‘Y కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. ఈ ఆర్డర్స్ తో ఇక నుంచి ఆయనకు 8 మంది గార్డులు రక్షణగా ఉంటారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) టీమ్ తోపాటు స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) అర్వింద్ భద్రతపై రివ్యూ నిర్వహించాయి. దీని ప్రకారం MP కాన్వాయ్ లో అర్వింద్ వెహికిల్ తోపాటు ఒకట్రెండు అదనంగా వాహనాలు ఉండనున్నాయి. ఆయన వెంట ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు ఉండే అవకాశం ఉంది.

అటు సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ కు సైతం ‘Y+ కేటగిరీ’ సెక్యూరిటీ కల్పిస్తూ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. రాష్ట్ర భద్రతను నిరాకరించిన ఈటల… కేంద్రం సెక్యూరిటీయే కావాలని కోరారు. అంతకుముందుగానే వీరిద్దరికీ రక్షణ కల్పించేందుకు IB, SIB ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ ఇద్దరు లీడర్లకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, ఇళ్లు, కార్యాలయాల్లోనూ వివరాలు తీసుకున్నారు. కానీ స్టేట్ సెక్యూరిటీపై ఇంట్రస్ట్ చూపించకపోవడంతో రాష్ట్ర పోలీసులు ముందడుగు వేయలేకపోయారు. వారు కోరిన విధంగానే కేంద్ర బలగాల నుంచి రక్షణ లభించేలా లేటెస్ట్ గా ఆర్డర్స్ ఇష్యూ అయ్యాయి.