‘ఆపరేషన్ సిందూర్’ వివరాల్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అఖిలపక్ష భేటీలో వివరించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, MIM చీఫ్ ఒవైసీ, ఆప్ సహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో… తమ అభిప్రాయాల్ని నేతలు తెలియజేశారు. రహస్య సమాచారాన్ని కేంద్రం తెలిపిందని, దాన్ని బయటపెట్టబోమని ఖర్గే అన్నారు. తామంతా ప్రభుత్వంతో ఉన్నామంటూ భరోసానిచ్చారు. TRFకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారం చేపట్టి, FATFలో పాక్ ను గ్రే-లిస్టులో చేర్చేలే చూడాలని ఒవైసీ సూచించారు. పార్టీల అధినేతలంతా ఒక్కమాట మీద నిలబడటమే దేశం సాధించిన ప్రధాన విజయమని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.