PCC క్రమ శిక్షణ కమిటీకి వస్తున్న ఫిర్యాదులు.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అంతర్గత విభేదాలపై ఎవరి మీద చర్యలు తీసుకున్నా నష్టమేనన్న భావన కనపడుతోంది. గీత దాటుతున్న నేతలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వరంగల్ లో కొండా మురళి, ఇతర నాయకుల మధ్య విభేదాలు.. జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి ఒక మంత్రిపై చేసిన కామెంట్స్.. మెదక్ జిల్లా గజ్వేల్ DCC అధ్యక్షుడికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు.. మునుగోడు MLA కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం.. పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. కొండామురళి విషయంలో లోతైన విచారణ జరపాలని భావిస్తుండగా.. పార్టీని, CMను ఎక్కడా విమర్శించలేదని, లోపాల్ని మాత్రమే ప్రస్తావిస్తున్నానన్నది రాజగోపాల్ రెడ్డి వాదన. ఇలా ముఖ్య నేతలంతా రచ్చకెక్కడంతో PCC క్రమశిక్షణ కమిటీకి సవాళ్లు ఎదరవుతున్నాయి.