లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ వేడుక(Reception)కు ముఖ్యమంత్రి రేవంత్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన వేడుకలో CM, స్పీకర్ తోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 12న అనీష్-రజనీ వివాహం జరగ్గా ఈరోజు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కమలం పార్టీ నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అంజలి బిర్లా అన్యమత వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కానీ అది తప్పని తేలగా ఆమె సింధీ హిందూ మతానికి చెందిన రజనీశ్ ను పెళ్లి వివాహమాడారని తేలింది. వీరిద్దరి వివాహ పత్రికను BJP ఎంపీ ‘X(పాత ట్విటర్)’లో షేర్ చేయడంతో ఊహాగానాలకు తెరపడింది.