25 వేల మంది టీచర్ల ఉద్యోగాల్ని రద్దు చేసిన సుప్రీం తీర్పుపై పశ్చిమబెంగాల్ CM మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలపై గౌరవం ఉందంటూనే తీర్పును అంగీకరించేది లేదన్నారు. 2016 రిక్రూట్మెంట్లో 25,754 మంది ఉద్యోగాలు పొందగా.. అక్రమాలు జరిగాయంటూ సుప్రీం రద్దు చేసింది. ఇది మమత సర్కాకు పెద్ద షాక్. ‘అత్యున్నత న్యాయవ్యవస్థ అయినా తీర్పును అంగీకరించను.. వ్యాపం కుంభకోణంలో విద్యాశాఖ మాజీ మంత్రి జైల్లో ఉన్నారు.. మరి ఈ కేసులో ఎంతమంది BJP నేతలు జైలుకు వెళ్లారు.. బెంగాల్ విద్యావ్యవస్థను కూల్చే BJP కుట్రలో భాగమిది.. మా లాయర్లు దీని గురించి చర్చిస్తున్నారు.. మానవీయ కోణంలో నేను అభ్యర్థుల పక్షాన్నే ఉంటా.. ఒకవేళ BJP నన్ను జైల్లో పెట్టినా సిద్ధంగా ఉన్నా..’ అని మాట్లాడారు.