హత్యలు, దోపిడీలు, నిర్బంధ కాండలు ఒకప్పుడు బిహార్(Bihar)లో సర్వసాధారణం. ఆటవిక, అరాచక పాలనతో భయంగా గడిపిన రాష్ట్రం ఇప్పుడు శాంతి, అభివృద్ధికి రూపంగా మారింది. ఇంజినీరింగ్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన CM నితీశ్ కుమారే దీని కారకుడు. ప్రశాంతత, నిబద్ధతతో రాష్ట్రం రూపురేఖలే మార్చారు. ఆయన్ను ఇప్పటికీ ‘స్వింగ్ ఫ్యాక్టర్’, ‘కింగ్ మేకర్’, ‘సర్వైవర్’ అని భావిస్తారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, CMగా ఈ నవంబరులో జరిగే ఎన్నికలకు 8వ సారి రెడీ అయ్యారు. ఇంక్ఇన్ సైట్ ఒపీనియన్ పోల్ ప్రకారం 60.4% మంది మహిళలు NDAకు, 28.4% మంది తేజస్వీయాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కు మద్దతుగా నిలిచారు. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 45% మంది నితీశ్ ను, 31% మంది తేజస్వీని CMగా కోరుకున్నారు.