హైదరాబాద్ జంట నగరాల్లో(Twin Cities) అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా వంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రికి వినతులు వస్తున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తూ హైడ్రా రాష్ట్ర రాజధానికే పరిమితమన్నారు. తన కుటుంబం కబ్జా(Encroachment) చేసినట్లు చూపిస్తే వాటిని స్వయంగా కూల్చివేయిస్తానంటూ చిట్ చాట్ లో అన్నారు.
చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధారణ కమిటీలు వేస్తామన్న CM… FTL, బఫర్ జోన్లలో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చేయడమేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు రోల్ మోడల్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే వారికి సంబంధించిన నిర్మాణాల్ని కూల్చివేస్తున్నామన్నారు.