కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు నీటిపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసి ఇప్పుడదే నీటిని వాడుతున్నారంటూ KTR చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టారు. హైదరాబాద్ కు తరలించే నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచేనని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నీరు కాదని, గోదావరి జలాలకు మూలం ఎల్లంపల్లి ప్రాజెక్టు అని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008-09లో ప్రారంభించిందే మల్లన్నసాగర్ అని, తుమ్మిడిహెట్టి ద్వారా ప్రాణహిత-చేవెళ్ల నీటి తరలింపు కోసం ప్రాజెక్టును మొదలుపెట్టారన్నారు.