రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలవొచ్చని ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని CM రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. BRS MLAలు తనను కలవడంపై వాళ్ల పార్టీకే అనుమానం ఉంటే నేనేం చేయాలి అంటూ మాట్లాడారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్.. పలు అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారన్న విషయం తన దృష్టిలో లేదని, ఎవరైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటే పార్టీదే తుది నిర్ణయమని తెలియజేశారు.
జగ్గారెడ్డినే అడగాలి…
ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు 20 మంది శాసనసభ్యులు రెడీగా ఉన్నారంటూ PCC వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ పై రేవంత్ స్పందించారు. ‘ఎవరి విషయంలో ఆయన అన్నారో నాకు తెలియదు.. ఎమ్మెల్యేలు చేరతారన్న విషయాన్ని మీరు జగ్గారెడ్డినే అడగాలంటూ సమాధానం దాటవేశారు. మా పార్టీ వాళ్లే కాదు.. ప్రతిపక్షాలకు చెందిన శాసనసభ్యులను కూడా మేడిగడ్డకు తీసుకెళ్తాం… కాళేశ్వరం అక్రమాలపై న్యాయ విచారణ జరిగిన తర్వాతే చర్యలు ఉంటాయన్నారు.
Published 10 Feb 2024