ఎంత చెప్పినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్టి పట్టించుకోవట్లేదని CM రేవంత్ ఆరోపించారు. కొత్తగా ఎంపికైన BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాంచందర్ రావే ఇక గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకుపోవాలన్నారు. ‘కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతిమాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే.. నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నా.. ముఖ్యమంత్రిగా నేను వారింటికెళ్లి కలిశా.. ఉత్తమ్, కోమటిరెడ్డి సైతం కలిశారు.. జల్ శక్తి మంత్రిని కలుద్దామని ఢిల్లీ వెళ్తే మా కంటే ముందే ఆయన్ను కలుస్తారు.. నిజంగా మీరు ప్రజల పక్షాన ఉండి మీరు కూడా అక్కడే ఉన్నట్లయితే మేము కూడా మిమ్మల్ని కలుస్తాం..’ అన్నారు. చంద్రబాబు మనుగడ గోదావరి జలాలపైనే ఆధారపడి ఉందన్నారు.