ఎనిమిది సీట్లల్లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా మీరు మారరా అంటూ BRSపై CM రేవంత్ విమర్శలు చేశారు. AP అక్రమంగా నీరు తీసుకెళ్తుందంటూ ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై శాసనసభలో మండిపడ్డారు. నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ పోలీసుల్ని AP పోలీసులు కొట్టినప్పుడు అధికారంలో ఉన్నదెవరూ అధ్యక్షా అంటూ మాట్లాడారు. ‘BRS ఈరోజు మార్చురీలో ఉంది.. చంద్రశేఖర్ రావు వద్ద ఉన్న కుర్చీని గుంజుకుని నాకు ఇచ్చారు.. ఆయన దగ్గరున్నది ప్రధాన ప్రతిపక్షం హోదా.. ఆ హోదా ఎవరికి కావాలి అధ్యక్షా.. అయితే KTR లేదా హరీశ్ రావుకు కావాలి.. వందేళ్లు KCR ఆరోగ్యంగా ఉండాలి.. ఆయన ఎల్లకాలం ప్రతిపక్షంలోనే ఉండాలి’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.